ఆ మంత్రికి కేసీఆర్ టిక్కెట్ ఇవ్వ‌రా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ 2019లో విజ‌యం సాధించేందుకు త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వేలు చేయిస్తున్నారు.ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో కేసీఆర్ గ‌తంలో ఆరు నెల‌ల‌కు ఓ సారి చేయించిన స‌ర్వేల‌ను ఇప్పుడు ప్ర‌తి మూడు నెల‌ల‌కు చేయిస్తున్నారు.

 Kcr Minister Ticket-TeluguStop.com

ప‌నితీరు స‌రిగా లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ఆయ‌న ప‌దే ప‌దే వార్నింగ్‌లు ఇస్తూనే ఉంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌నితీరు స‌రిగా లేక‌పోవ‌డంతో పాటు త‌ర‌చూ వివాదాల్లో చిక్కుకుంటోన్న ఓ మంత్రికి కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌ర‌న్న ఊహాగానాలు టీఆర్ఎస్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి త‌న దూకుడు వైఖ‌రితో కేసీఆర్‌కు త‌ల‌చూ త‌ల‌నొప్పిగా మారారు.గ‌తంలో టీడీపీలో ఉన్న ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి మరోసారి తాండూర్ నుంచి గెలిచారు.

మంత్రి అయ్యాక ఆయ‌న ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ర‌చూ జోక్యం చేసుకోవ‌డంతో పాటు భార్య సునీత జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా ఉండ‌డంతో దానిని అడ్డం పెట్టుకుని జిల్లాలో భారీగా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి.ఆయ‌న‌కు చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి పొస‌గ‌డం లేదు.

మంత్రి తీరుపై విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా టాక్‌.

ఇక సీనియ‌ర్ నేత హ‌రీష్‌రెడ్డితోను ఆయ‌న‌కు విబేధాలే ఉన్నాయి.

ఇటీవ‌ల తాండూర్ మునిసిపల్ చైర్మ‌న్ ఎన్నికల్లోను టీఆర్ఎస్ ఓట‌మిపాలైంది.దీంతో కేసీఆర్ ఆయ‌నపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి.

ఇక తాండూర్‌లో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి కాకుండా గ్రేట‌ర్ ప‌రిధిలోని శేరిలింగంప‌ల్లి నుంచి పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నార‌ట‌.

అయితే కేసీఆర్ మాత్రం మ‌హేంద‌ర్‌రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస్స‌లు టిక్కెట్టే ఇవ్వ‌ర‌ని కూడా అంటున్నారు.

అంత‌కూ కావాలంటే రెడ్డి కోటాలో ఎవ‌రికి అయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే ఏ గుత్త సుఖేంద‌ర్‌రెడ్డి లాంటి వాళ్ల‌కో ఆయ‌న ప్ర‌యారిటీ ఇస్తారే త‌ప్పా మ‌హేంద‌ర్‌రెడ్డిని మాత్రం ఆయ‌న ప‌క్క‌న పెట్టేస్తార‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube