Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మహేష్ సినిమా కొంటె అల్లరి నరేష్ సినిమా ఫ్రీ…

మహేష్ బాబు నటిస్తున్న ‘వన్-నేనోక్కడినే’ మూవీ శాటిలైట్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి.దాదాపు 12 కోట్ల రూపాయలకు ఈసినిమా హక్కుల్ని సన్ నెట్ వర్క్ చేజిక్కించుకున్నట్లు వార్తలొచ్చాయి.అంతకముందు పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ శాటిలైట్ రైట్స్ 11కోట్లకు అమ్ముడుపోగా మహేష్ సినిమా దాన్ని బ్రేక్ చేసిందని మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు.

కాని ఇప్పుడు ఈవిషయం గురించి ఒక నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అదేమిటంటే మహేష్ నటిస్తున్న ‘వన్’ సినిమా ప్రొడ్యూసర్ లలో ఒకరైన అనిల్ సుoకర అంతకుముందు అల్లరి నరేష్ తో ‘యాక్షన్-త్రిడి’ అనే సినిమాను రూపొందించాడు.ఈసినిమాకు అనిల్ సుoకర నే దర్శకత్వం వహించాడు.మొట్ట మొదటి కామెడి చిత్రం అని ఎంత ఊదరగొట్టిన ప్రయోజనం లేకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇప్పుడు వన్ సినిమా ప్రొడ్యూసర్ లలో ఒకరైన అనిల్ సుంకర యాక్షన్ 3డి మరియు ‘వన్-నేనోక్కడినే’ హక్కులను కలిపి 12 కోట్లకు అమ్మారట.

అంటే మహేష్ సినిమా కొన్నందుకు నరేష్ సినిమాను ఫ్రీగా ఇచ్చేశారు.అది తెలీక పాపం మహేష్ ఫ్యాన్స్ అందరూ మహేశ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రికార్డ్ ను బద్దలుకొట్టిందని సంబరాలు జరుపుకుంటున్నారు.మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ మరొకసారి ఫేక్ రికార్డ్ లను ప్రచారం చేసుకుoటున్నాడని ఆరోపిస్తున్నారు.అంతకముందు దూకుడు సినిమా కలెక్షన్ల విషయంలో కూడా మహేష్ తప్పుడు కలెక్షన్లు చూపించాడని ఆరోపణలు షురూ చేస్తున్నారు.గమ్మతైన విషయం ఏంటంటే దూకుడు నిర్మాతలు,వన్ సినిమా నిర్మాతలు ఒకరే కావటం.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top