మహేష్ కంటే ఎన్టీఆర్ తోనే ఎక్కువ లాభం

మరో ఎనిమిది రోజులు గడిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “జై లవ కుశ” వస్తోంది.మరో పద్నాలుగు రోజులు గడిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ వస్తోంది.

 Ntr Gives More Profit Than Mahesh-TeluguStop.com

ఈ రెండు సినిమాలు కలిపి చేసిన ఓవరాల్ బిజినెస్ ఏకంగా దగ్గర దగ్గర 280 కోట్లు.అందులో కేవలం థియేట్రికల్ రైట్స్ తీసుకుంటే 215 కోట్లకు పైమాటే.

అంటే ఈ రెండు సినిమాలు కలిపి ఎంతలేదన్న 250 కోట్ల షేర్ వసూలు చేస్తే తప్ప పంపినిదారులకు ఊరట ఉండదు.ఇందులో ఎక్కువ భారం మహేష్ మీదే.

స్పైడర్ థియేట్రికల్ రైట్స్ 132 కోట్లకు అమ్ముడుపోతే, శాటిలైట్, మిగితా హక్కులు కలుపుకొని 165 కోట్లకు పైగా రాబట్టుకుంది.మరోవైపు జైలవకుశ థియేట్రికల్ బిజినెస్ 85 కోట్ల దాకా జరిగితే, ఓవరాల్ బిజినెస్ 110 కోట్ల దాకా ఉంది.

ఈ లెక్కలు చూస్తే మహేష్ సినిమా బిజినెస్ ఎక్కువ అయ్యిందని తెలుస్తుంది.తమిళ వెర్షన్ కూడా ఉంది కదా అని అంటున్నారా? కేవలం తెలుగు వెర్షన్ తీసుకున్నా, స్పైడర్ బిజినెస్ జైలవకుశ కన్నా ఎక్కువే, కాని మహేష్ కంటే ఎక్కువ లాభం ఎన్టీఆర్ తోనే.అదెలా?

బడ్జెట్ అండి, బడ్జెట్.స్పైడర్ బడ్జెట్ ఎక్కడా, జైలవకుశ బడ్జెట్ ఎక్కడా? 80-90 కొట్లలో సినిమా పూర్తి చేద్దామని స్పైడర్ మొదలుపెట్టారు.ఆ లెక్క ఆ తరువాత 100 కి వెళ్ళింది, అక్కడినుంచి ఓసారి పది పెరిగి, మరోసారి పది పెరిగి ఏకంగా 120 కోట్లు అయ్యింది.నిర్మాతలు 120 కోట్లు పెడితే, వారి చేతికి 165-170 కోట్లు వచ్చాయి.

మరి జైలవకుశ సంగతి చూస్తే, దగ్గరదగ్గర 50 కోట్ల బడ్జెట్ పెడితే బిజినెస్ 110 కోట్లు దాటింది.ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరి వలన ఎక్కువ లాభాలు వచ్చాయో?

ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్టు, బిజినెస్ ఎక్కువ అవగానే పని పూర్తయ్యిపోలేదు.ఈ పోటిలో ఓపెనింగ్స్ ఎవరు అదరగొడతారో చూడాలి, లైఫ్ టైం రికార్డు ఎవరు సెట్ చేస్తారో చూడాలి.అలాగే ఎవరు బ్రేక్ ఈవెన్ చేయిస్తారో చూడాలి.

కాని ఏరకంగా చూసినా, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే ఎన్టీఆర్ సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చేలా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube