మగ వ్యభిచారుల జీవితం ఇంత దారుణంగా ఉంటుందా

మీకు మోడరన్ ప్రపంచ జ్ఞానం ఉన్నట్లయితే మగ వ్యభిచారులు ఏమిటి, ఇలాంటివారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోరు.ఎందుకంటే వ్యభిచార వృత్తిలో మగవారు కూడా ఉంటారు.

 A Male Prostitute Explains What It Is Like To Be An Escort 1-TeluguStop.com

ఎలాగైతే ఆడ వ్యభిచారులని మగవారు బుక్ చేసుకుంటారో, అచ్చం అలానే మగ వ్యభిచారులను ఆడవారు కూడా బుక్ చేసుకుంటారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి లేదు.

మగ వారు వ్యాభిచారంలోకి దిగినా ఏమిటి నష్టం, ఎలాగో గర్భం పొందే భయం ఉండదు, నొప్పి లాంటి ఇబ్బందులు ఉండవు, సుఖపడుతూ, ఒకరిని సుఖపెడుతూ, ఆ పనికే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనే అపోహలో మాత్రం ఉండకండి.మగ వ్యభిచారులకి కూడా కష్టాలు ఉంటాయి.

వారి జీవితం కూడా దుర్భరంగా ఉంటుంది.

కండలు తిరిగిన దేహం లేని మగ దేహాన్ని కోరుకోవడం లేదు స్త్రీలు.

అదే అమ్మాయి కొంచెం బరువు ఎక్కినా గుచ్చి గుచ్చి పట్టించుకోరు కాని, మగవారు ఖచ్చితంగా సరైనా షేపులో, కండలు తిరిగి ఉండాల్సిందే.ఇంకా ఇలాంటి డిమాండ్స్ ఎన్నో ఉంటాయి.

అవన్నీ ఒక మగ వ్యభిచారి మాటల్లోనే చదువుకుందామా? కాస్మోపాలిటన్ మ్యాగజీన్ వారు ఒక మగ వ్యభిచారి ద్వారా మగవారి దృష్టిలో వ్యభిచారం ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.అతని పేరు బయటకి చెప్పడం వీలు కాదు కాని, అతని మాటల్లో ఆ సంగతులు కొన్ని తెలుసుకోండి.

“నేను ఈ వృత్తిలోకి వచ్చి 3 ఏళ్ళు గడిచాయి.మమ్మల్ని బుక్ ఆడవారు ఎక్కువ సంపన్నులే ఉంటారు.

అంటే బిజినెస్ మెన్ భార్యలు ఎక్కువ.వారి భర్తలకి భార్యలతో గడిపే సమయం దొరకదు.

అందుకే మమ్మల్ని బుక్ చేసుకుంటారు.సాయంత్రం పూట హోటల్ లో వారి ఖర్చులతోనే డిన్నర్ ఏర్పాటు చేస్తారు.

రుచికరమైన తిండి దొరికినట్టే కాని, అది ఒక పరీక్ష లాంటిది.కస్టమర్ తో బాగా మాట్లాడాలి.

ఆమెకి బోర్ కొట్టకుండా ముచ్చట్లు పెట్టాలి.మనకు ఫీలింగ్స్ లేని అమ్మాయిలను ఎంతసేపని నవ్వించగలం.20, 30 ఏళ్ల వయసు ఉన్నవారు మాత్రమే కాదు, 65 ఏళ్ల కస్టమర్లని కూడా చూసా నేను.తప్పవు, భరించాలి.

ఇక అసలు విషయం జరిగేటప్పుడు ఆమె ఏమి కోరుకున్నా చేయాల్సిందే.కొందరు చాలా పైశాచికంగా ప్రవర్తిస్తారు.

అది చూస్తే అనిపిస్తుంది, ఊరికే మగజాతి మాత్రమే ఆడిపోసుకుంటారు అని.కామం ఎక్కువైతే మనిషికి లింగ భేదం లేదు.మేం చాలా ట్రైనింగ్ పొందాలి.సెషన్ ని సాధ్యమైనంతవరకు పోడిగించాలి.త్వరగా ముగిస్తే డబ్బు తక్కువ ఇస్తారు.సాధారణంగానే ఆడ వ్యభిచారులతో పోలిస్తే మాకు అందే డబ్బు చాలా తక్కువ.

అందులో కస్టమర్ అంచనాలను అందుకోలేకపొతే ఇంకా తక్కువ మొత్తం అందుతుంది.వారే డామినేట్ చేసేలా కొన్ని పోజిషన్స్ ఎంచుకుంటారు.

చాలా నొప్పివేస్తుంది.అయినా భరించాలి.

నాకు ఓసారి పురుషాంగం ఫ్రాక్చర్ కూడా అయ్యింది.బయట జనాలు అనుకున్నంత సులువు కాడు మా పని’ అంటూ గోడు వేలబోసుకున్నాడు పాపం ఆ మగ వ్యభిచారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube