» »ఢిల్లీ వరకు నడవనున్న బాబు …

ఢిల్లీ వరకు నడవనున్న బాబు …

ఢిల్లీ వరకు నడవనున్న బాబు … photos,image,pics,photo gallery

చంద్రబాబు మరోసారి పాదయాత్ర కి సిద్ధం అయ్యారు.అంతకముందు ఏకబిగిన వేల కిలోమీటర్ ల పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి వచ్చిన బాబు మరొకసారి ఢిల్లీ వరకు పాదయాత్ర చేయనున్నారని సమాచారం .విభజన నిర్ణయం వల్ల తలెత్తిన పరిణామాలను వివరించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని అనుకుంటున్నట్లు సమాచారం.ఐతే ఢిల్లీ వరకు పాదయాత్ర గా వెళ్ళాలా వద్దా అన్నది పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను త్వరగా చక్కదిద్దాలని రాష్ట్రపతి, ప్రధానిని బాబు కోరనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘తెలుగు జాతి ఆత్మ గౌరవ పరిరక్షణ యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. సీమంద్రులకు త్వరగా రాజధాని గురించి పరిష్కారం చూపకపోతే రెండు ప్రాంతాలు శాశ్వతంగా బద్ధ శత్రువుల్లాగా మారే ప్రమాదం ఉందని బాబు వాపోయారంట.

తన పరిపాలన కాలం లో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతున్న తరుణంలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసిందని ఆయన అన్నట్లు సమాచారం. కాంగ్రెసు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అలాగే జరుగుతోందని ఆయన అన్నారు. బస్సు యాత్ర చేపట్టి ఢిల్లీ చేస్తున్న అన్యాయాల గురించి ప్రజలకు వివరిద్దాం అని ఆయన చెప్పినట్టు సమాచారం .

ఈ వయస్సులో మరొకసారి యాత్రలు అంటే శరీరం సహకరించదని పార్టీ నేతలు వద్దని వారిoచారని సమాచారం