కాకినాడ కార్పొరేష‌న్ రిజ‌ల్ట్ ఇదేనా..!

నంద్యాల మ‌హాసంగ్రామం ముగిసింది.ఇప్పుడు అంద‌రిదృష్టి కాకినాడ రిజ‌ల్ట్ మీదే ఉంది.

 Kakinada Corporation Election Result 1-TeluguStop.com

కాకినాడ మేయ‌ర్ పీఠం మాదే మాదే అంటూ ప్ర‌ధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ ధీమాతో ఉంటే కాంగ్రెస్ కూడా స‌త్తా చాటుతామ‌ని చెపుతోంది.మొత్తం కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి.

ప్రతిపక్ష వైసీపీ 48 డివిజన్లలోనూ, ఉనికి చాటుకునేందుకు రెడీ అవుతోన్న కాంగ్రెస్ 17 డిజ‌విన్ల‌లోను పోటీకి దిగుతున్నాయి.

మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 25 డివిజన్లు రావాల్సి ఉంది.

అయితే ఇక్క‌డ కౌంటింగ్‌కు ముందే టీడీపీ ఖాతాలో మూడు ఓట్లు ప‌డ్డాయి.కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు, రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌లక్ష్మి, ఎమ్మెల్సీ ర‌వికిర‌ణ్ వ‌ర్మ ముగ్గురు టీడీపీకి కో ఆప్ష‌న్ స‌భ్యులుగా ఉన్నారు.

ఇక ఇక్క‌డ గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి, రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం టీడీపీకి 30కు త‌గ్గ‌కుండా డివిజ‌న్లు వ‌స్తాయంటున్నారు.

టీడీపీ వాళ్ల లెక్క ప్రకారం త‌మ‌కు 30 డివిజ‌న్లు వ‌స్తాయ‌ని అంటున్నారు.

బీజేపీ వాళ్ల లెక్క 5గా ఉంది.వైసీపీ వాళ్లు త‌మ‌కు గ్యారెంటీ 28 డివిజన్ల‌లో గెలుపు ఖాయం అంటున్నారు.

ఇక రెబల్స్‌లో టీడీపీ రెబ‌ల్స్ 4 సీట్ల మీద‌, వైసీపీ రెబ‌ల్స్ 2 సీట్ల మీద ఆశ‌లు పెట్టుకున్నారు.ఎవ‌రి లెక్క ఎలా ఉన్నా అక్క‌డ పోటింగ్ స‌ర‌ళిని బ‌ట్టి రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం టీడీపీ+బీజేపీ కూట‌మికి 32-25 సీట్లు, వైసీపీకి 10-12 వ‌స్తాయ‌ని అంటున్నారు.

ఇక ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి.ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే కౌంటింగ్‌లో ప్ర‌తి గంట‌కు 14 వార్డుల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.ఉద‌యం 11.30 గంట‌ల‌కు మొత్తం ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube