కలల గురించి ఆసక్తికరమైన నిజాలు

నిద్రలో కలలు రావటం అనేది మానవ సహజం.మనకు వచ్చే కలలలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.

 Interesting Facts About Dreams-TeluguStop.com

మరి కొన్ని కలలు నిరాశను కలిగిస్తాయి.అయితే కొంత మంది మాత్రం తమకు వచ్చిన కలలు నిజం అవుతాయని నమ్ముతారు.

కలలపై చాలా పరిశోదనాలు జరిగాయి.అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కలల గురించి ఎవరికీ తోచిన విధంగా వారు అర్ధాలను వెతుక్కోవటం సర్వసాదారణం అయ్యిపోయింది.అటువంటి కలల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1.మధ్య నిద్ర ముఖ్యం
నిద్రలో ఒక లోతైన దశను మధ్ నిద్ర అని అంటారు.ఈ మధ్య నిద్రలోనే కలలు వస్తూ ఉంటాయి.తగినంత నిద్ర లేకపోతే ఆందోళన, చిరాకు, కోపం మరియు భోజన క్రమరాహిత్యాల వంటి మానసిక సమస్యలు వస్తాయి.

2.పీడ కలలు
కోపం, విచారం, భయం మరియు భావోద్వేగాలు ఉన్నప్పుడు సాదారణంగా పీడ కలలు వస్తూ ఉంటాయి.

అంతేకాక తరచుగా మేల్కొన్నప్పుడు ఒత్తిడి, భయం మరియు అపరాధ భావం వలన కూడా పీడ కలలు వస్తాయి.అయితే ఆశ్చర్యకరంగా, ఈ కలలు పెద్దవారిలో కన్నా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి.

3.పెంపుడు జంతువుల కలలు
నిజమే పెంపుడు జంతువులు కూడా కలలను కంటాయి.పిల్లులు మరియు కుక్కల వంటి పెంపుడు జంతువులు నిద్ర పోయినప్పుడు, కాళ్ళు వనకటం,ముక్కులు మరియు మీసాలు ఫన్నీ గా కొద్దిగా శబ్దాలు చేయటం వంటివి ఉంటే కనుక అవి కలలను కంటున్నాయని అర్ధం.

4.బ్లాక్ & వైట్ కలలు
ప్రతి ఒక్కరు రంగు రంగుల కలలను కంటూ ఉంటారు.కానీ ఆశ్చర్యకరంగా 12 శాతం మంది కేవలం బ్లాక్ & వైట్ కలలను మాత్రమే కంటారు.

5.కలలను మర్చిపోవటం సర్వ సాధారణం
ఉదయం లేవగానే మొదటి నిమిషంలోపే 90 శాతం మంది కలలను మర్చిపోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube