కండలు పెరగాలంటే ఈ ఆహారపదార్థాలు అస్సలు తినొద్దు

ఈరోజుల్లో క్యూట్ గా ఉండే అబ్బాయిల కంటే, హాట్ గా ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపాడుతున్నారు అమ్మాయిలు.అంటే కాస్త ధృడంగా, కండలు తిరిగిన దేహంతో ఉండే మగవారి పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు అన్నమాట.

 Foods To Avoid For Gaining Muscle 1-TeluguStop.com

అందుకే ఫిట్ నెస్ చాలా ముఖ్యమైపోయింది.మజిల్ ఉన్న మగవాడి అందం వేరు.

ఒకేవేళ మీరు బాడి బిల్డింగ్ చేయాలి అనుకుంటే ఏం తినాలో మేం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.బాడి పెరగాలంటే ప్రోటీన్ ఉండే ఆహరం ఎక్కువ తినాలి అని ఇంటర్ పూర్తియైన ప్రతి పిల్లాడు చెబుతాడు.

చికెన్, గుడ్లు, అరటిపండ్లు, ఇలా లిస్టు చదివేస్తాడు.ఏం తినాలో ఒకే, మరి ఏం తినకూడదు? కండలు పెంచాలి అనుకున్నప్పుడు మీ డైట్ లోంచి తీసేయవలసిన ఆ ఆహారపదార్థాలు ఏమిటి?

* Glycemic Index (GI) ఎక్కువ ఉండే ఆహారపదార్థాలను తినకూడదు.ఈ ఆహార పదార్థాలు షుగర్ లెవల్స్ ని పెంచాస్తాయి.మనం ఎక్కువగా తినే తెల్లబియ్యంతో పాటు బ్రెడ్, చీజ్, పైనాపిల్, స్వీట్ పొటాటో, కార్న్ ఫ్లేక్స్ ఈ క్యాటగిరిలోకి వస్తాయి.

నొక్కి నొక్కి చెప్పాలంటే, తెల్ల బియ్యం పక్కనపెట్టండి.

* కండలు బాగా పెరగాలంటే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ నార్మల్ గా ఉండాలి.దాన్ని ఉత్పత్తి ఎక్కువ ఉండకూడదు.మీరు కూల్ డ్రింక్స్ ని ఇష్టంగా తాగేవారే అయితే, మీ ఇష్టాన్ని చంపుకోండి.

ఆర్టిఫిషియల్ షుగర్స్ ని పక్కనపెట్టండి.ఇవి మామూలు షుగర్స్ కంటే ప్రమాదకరం.

* ఫాస్ట్ ఫుడ్ వద్దు.ఎందుకంటే వీటిలో ప్రాసెస్డ్ ఆయిల్స్ వాడతారు.జంక్ ఫుడ్ ని అసలు మామూలు సమయాల్లోనే ముట్టుకోకూడదు.ఇక బాడి బిల్డింగ్ సమయంలో అయితే వద్దు.

బేకరీ ఫుడ్, జంక్ ఫండ్ తీసుకోవడం వలన మీ కాలరీల కౌంట్ లో తేడా కొడుతుంది.అలాగే ఫ్రైడ్ వంటకాలు మానేయ్యండి.

* ఎక్కువ కాలరీలు అందించే ఫాస్ట్ ఫుడ్ వద్దు అంటున్నారు అంటే అర్థం తక్కువ కాలరీలు ఉండే ఆహారపదార్థాలు తినాలి అని కాదు.న్యూట్రింట్స్ తో పాటు కాలరీలు కూడా బాగా ఇవ్వగలిగే కూరగాయలు, పండ్లనే తినండి.

మీకు బలాన్ని ఇవ్వలేని పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైనా, మనకు అనవసరం.

* ఇతర ఆహారపదార్థాల గురించి చెప్పాలంటే, సలాడ్స్ ఎప్పటికప్పుడు చేసుకొని తినండి.

రెడి చేసిపెట్టి ఉంచేసిన సలాడ్స్ వద్దు.డెసర్ట్స్ కి టెంప్ట్ అవొద్దు.

ఐస్ క్రీమ్ తినడం మానేయ్యండి.ఇక స్వీట్స్ తినొద్దు అని కొత్త చెప్పే పని లేదు.

జ్యూసులు మరీ ఎక్కువ తాగొద్దు.డైరి ప్రాడక్ట్స్ వద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube