ఈ చిన్న చిట్కాతో నోటి అల్సర్స్ మ‌టుమాయం

నోటిలో పుళ్లు ఇవి చాలా మందికి ఒక్కోసారి ఎదురయ్యే సమస్య.కొంతమందికి నెలలో నాలుగు సార్లు అయినా వీటి భారిన పడుతుంటారు.

 Mouth Ulcers Prevention Treatement-TeluguStop.com

ఇవి వచ్చినప్పుడు భోజనం చేయలేము, మరే ఇతర పదార్ధాలు తినాలన్నా ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది.ఉదయాన్నే బ్రష్ చేసుకోవాలంటే కూడా చేసుకోలేని సమస్య కలుగుతుంది.

అసలు ఇవి ఏర్పడటానికి కారణం ఏమిటంటే విటమిన్స్ లోపం.

శరీరానికి సరైన స్థాయిలో విటమిన్స్ అందనపుడు ఈ సమస్యలో వస్తాయి.

అంతేకాదు అనుకోకుండా కొరుక్కోవడం వల్ల‌ కూడా ఇలా జరుగుతుంది.చిన్న చిన్న చిట్కా లని పాటించడం ద్వారా కూడా వీటిని కంట్రోల్ చేయవచ్చు.

గ్లాసు వేడినీటిలో కొత్తిమీర ఆకులు వేసి కొంచం సేపు అయిన తరువాత చల్లార్చి రోజు రెండు సార్లు ఈ రసాన్ని పుక్కిలించాలి.ఎందుకంటే కొత్తిమీరలో యాంటి ఫంగల్ , యాంటిసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల‌ సమస్య తగ్గుతుంది.

టమాటా రసాన్ని రోజుకు మూడు నుండీ నాలుగు సార్లు పుక్కిలించి ఉమ్మవచ్చు.అలాగే అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడాని కలిపి ఆ నీటిని పుక్కిలించడం వల్ల‌ కూడా ఉపశమనం కలుగుతుంది.

జీర్ణ క్రియ సరిగా లేనప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది.అందుకే తులసి ఆకులు రోజుకి మూడు సార్లు నమిలి తినడం వల్ల‌ ఈ సమస్యలకి దూరంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube