ఇంక‌.. బాబు-లోకేష్‌లు దొరుకుతారా? త‌మ్ముళ్ల ఆవేద‌న‌

తెలుగుదేశం పార్టీ అధినేత‌, మంత్రుల్లో జోష్ నింపిన నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు ఆ పార్టీ త‌మ్ముళ్ల‌లో తీవ్ర ఆవేద‌న మిగిల్చింద‌ని అంటున్నారు.ఇది గెల‌వ‌కుండా ఉండి ఉంటే ప‌రిస్థితి ఇంకో ర‌కంగా ఉండేద‌ని, త‌మ‌కు ప్రాధాన్యం పెరిగేద‌ని దిగువ‌స్థాయి నేత‌లు అనుకుంటున్న‌ట్టు వినికిడి.

 Babu Lokesh Nandyal Win-TeluguStop.com

వాస్త‌వానికి నంద్యాల ఉప పోరుకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు.ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లు తమ అవసరం ఉన్నప్పుడు తప్ప.

మంత్రులు స‌హా పార్టీ సీనియ‌ర్ల‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేదని, ఇక‌, కిందిస్థాయి నేత‌ల ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఇప్పుడు నంద్యాల‌లో గెల‌వ‌డం, పార్టీ ఊహించ‌ని మెజారిటీ సాధించ‌డం, అభ్య‌ర్థి సునాయాసంగా గెల‌వ‌డం వంటి ప‌రిణామాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు, లోకేష్‌ల‌లో ఎంత‌లేద‌న్నా.

కొంచెం అహంకారం పెంచేలా చేస్తాయ‌ని అంటున్నారు.అదికూడా ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే టీడీపీ నంద్యాల‌లో ప‌రిగెత్త‌డం కూడా బాబుకు కొంత గ‌ర్వంగానే ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో ఇక త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకుంటారా? అనేది దిగువ‌స్థాయి త‌మ్ముళ్ల ఆవేద‌న‌.దీంతో తాము చెప్పినట్లే వినేవారిని తప్ప.ఇతర పార్టీ నేతలను మరింత దూరం పెట్టే అవకాశం ఉందని ఓ సీనియర్ మంత్రి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.

ప్రభుత్వానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయాలు మొదలుకుని.పార్టీపరమైన నిర్ణయాలు కూడా ఏకపక్షంగానే సాగుతున్నాయని, నంద్యాల రిజ‌ల్ట్‌తో రాబోయే రోజుల్లో ఈ ‘కేంద్రీకృత’ వ్యవస్థ మరింత పెరిగే అవకాశం ఉందని.

అంటున్నారు.అయితే, ఈ ప‌రిణామం మంచిదా కాదా అంటే అది అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుందని ఆ మంత్రి వ్యాఖ్యానించారు.

మంత్రి నారా లోకేష్ అయితే అసలు ఇప్పటికే తాము ఏపీకి చాలా చేశామని.ఇంత కంటే ఎవరైనా ఏమి చేస్తారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికలో ఊహించని స్థాయిలో టీడీపీకి విజయం దక్కిందనేది ఎంత వాస్తవమో…రాష్ట్రమంతటా ఇదే తరహా పరిస్థితి ఉంటుందని అనుకోవడం అంతే పొరపాటు అవుతుందని ఆ మంత్రి వ్యాఖ్యానించారు.రాబోయే కాలంలో జరగబోయే సంఘటనలను చూస్తూ ఉండటం తప్ప.

పార్టీలో ఎవరూ ఏమీచేయగలిగే పరిస్థితి లేదని, ముఖ్యంగా చంద్ర‌బాబు, చిన‌బాబుల‌తో మాట్లాడే ప‌రిస్థితి కూడా త‌గ్గిపోతుంద‌ని, వారు చెప్పేదే వేదం అవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube