అందముంది ... చూపిస్తాను .. నా ఇష్టం అంటోంది

బాలివుడ్ భామ ఇషా గుప్తా గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.ఈ బ్యూటి తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెట్టడంతో అందరి దృష్టి ఈమెపై పడింది.

 I Have A Beautiful Body And I Will Show It Isha Guptha-TeluguStop.com

ఆ తరువాత కొన్ని నగ్న ఫోటోలు కూడా పోస్ట్ చేయడంతో అది కాస్త వివాదమయ్యింది.తనపై వస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ, తానూ మొదటిసారి నగ్నంగా ఫోటోషూట్ చేయలదని, మోడలింగ్ చేసే సమయంలో చేసిందే ఇప్పుడు చేస్తున్నాను, నేను ఎలా ఉండాలో నాకు బయటివారు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఇష్టా ఇప్పటికే ఘాటు స్టేట్మెంట్ ఇచ్చింది.

అయినా జనాలు ఆగడం లేదు.

ఆమెకి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి అంట.అసలు నువ్వు భారతీయరాలివేనా, మీ తల్లిదండ్రుల పరువు తీస్తున్నావు అంటూ పర్సనల్ లైఫ్ మీదా కూడా కామెంట్ చేస్తూ వేలమంది మెయిల్స్ పంపించారట.దాంతో ఇషాకి మళ్ళీ కోపం వచ్చింది.

అందముంది చూపిస్తాను నా ఇష్�

“ఈ ప్రపంచంలో రోజుకి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి.ఎన్నో పెద్ద పెద్ద విషయాలు పట్టింపుకి నోచుకోవడం లేదు.అవన్నీ వదిలేసి నా మీదే ఎందుకు పడుతున్నారో, మీడియా నా గురించే ఎందుకు రాస్తోంది.న్యూడ్ ఫోటోలు పెట్టానని నన్ను అవమానిస్తూ చాలామంది మెయిల్స్ పంపారు.కాని నేను ఎవరిని తిట్టలేదు.నేను అసలు భారతీయరాలినే కాదు అంటున్నారు.

బట్టల్లోనే నా భారతీయత కనిపిస్తుందా? మా నాన్న ఈ దేశం కోసం ఎంతో చేసారు.

మీ అందరి తండ్రులు ఏం చేసారు? నేను అందంగా ఉంటాను.చాలా కష్టపడి ఈ అందాన్ని మెయింటేన్ చేస్తున్నాను.అంత కష్టపడినప్పుడు చూపిస్తే తప్పేంటి.నా దగ్గర అందం ఉంది, చూపిస్తాను.తప్పేంటి? ఏ అమ్మాయికి అయితే ఆత్మవిశ్వాసం లేదో, అలాంటి అమ్మాయిలే నన్ను విమర్శిస్తున్నారు.ఎందుకంటే వాళ్లకి నేనంటే కుళ్ళు.ఇక నా అందాల ఆరబోత వలన భారతీయ మగవారి మగతనానికి వచ్చిన నష్టం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.నా ఫోటోలపై కామెంట్స్ చూస్తోంటే నవ్వొస్తోంది” అంటూ మరోసారి మరో గట్టి స్టేట్మెంట్ పాస్ చేసింది ఇషా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube