స్టేజిపై బూతులు, నేతకి చురుకులు ‌.. యువహీరో వీరంగం

సైడ్ హీరోగా పరిచయమై, ఆ తరువాత పెళ్ళిచూపులు తో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, అప్పుడే తనకంటూ ఓ మార్కేట్ ఏర్పాటు చేసుకున్నాడు.అర్జున్ రెడ్టి సినిమాను ఆరు కోట్ల దాకా చెల్లించి సొంతం చేసుకున్నారు బయ్యర్లు.

 Vijay Devarakondas Fcking Speech For Publicity 1-TeluguStop.com

విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ .రెండింటికి విపరీతమైన స్పందన లభించింది.ఇక హీరోహీరోయిన్లు ముద్దుపెట్టుకుంటున్న పోస్టర్ ఒకటి ఎక్కడపడితే అక్కడ కనబడుతోంది.మొత్తానికి కొంచెం సంచలనాత్మక రీతిలో అయినా, సినిమాకి కావాల్సినంత పబ్లిసిటి అయితే దొరుకుతోంది

అర్జున్ రెడ్టి విపరీతమైన కోపం ఉన్న మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు విజయ్.

మరి నిజజీవితంలో లో విజయ్ అచ్చం అలాగే ఉంటాడో లేడో చెప్పలేం కాని, ఆ ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి ఈమధ్య.అర్జున్ రెడ్డి కిస్సింగ్ పోస్టర్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ కనబడుతోంది.

నగరమంతా కనిపిస్తున్న ఈ పోస్టర్ యువతను పెడదేవ పట్టించేలా ఉందని కాంగ్రెస్ నేత హనుమంతరావు వాదిస్తున్నారు.నిన్న ఓ బస్ మీద ఉన్న కిస్సింగ్ పోస్టర్ ని ఆయన తొలగించే ప్రయత్నం కూడా చేసారు.

ఆ ఫోటోని తన ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేసిన విజయ్, దానికి “తాతయ్య, చిల్” అనే చురుకైన కాప్షన్ పెట్టాడు.

ఇక రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

తన స్పీచ్ లో పలుమార్లు ఓ పెద్ద ఇంగ్లీష్ బూతుని వాడిన విజయ్, యువత ఎవరి ముందు తలవంచకూడదు అంటూ ఓ మెసెజ్ పాస్ చేసాడు.ఇక అర్జున్ రెడ్డి టీజర్ లో ఉన్న ఓ బూతు డైలాగ్ మీ అందరికి తెలిసిందే, ఆ డైలాగ్ ని సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేసిందట.

ఏ సర్టిఫికేట్ ఇచ్చి కూడా డైలాగ్ ని మ్యూట్ చేసారని, ఆ డైలాగ్ వరకు తనకు థియేటర్లలో జనాలే డబ్బింగ్ చెప్పాలని ఫంక్షన్ కి కుర్రాళ్ళందరితో ఆ బూతు మాట్లాడిపించాడు విజయ్

ఇదంతా పబ్లిసిటి కోసం చేస్తున్నారో, లేదా విజయ్ ఆటిట్యూడ్ అలాంటిదో అర్థం కావడం లేదు.చూద్దాం, ఆగష్టు 25న విడుదలయ్యే ఈ సినిమాలో ఎంత విషయం ఉందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube