బ్రేక్ అప్ తరువాత బాధ తగ్గాలంటే ఈ 5 పనులు చేయండి

ఎయిడ్స్ కి కూడా చికిత్స దొరుకుతుందేమో కాని లవ్ ఫెల్యూర్ కి మాత్రం చికిత్స దొరకదు.ఆలోచనలు కమ్మేస్తాయి, జ్ఞాపకాలు దహింపజేస్తాయి, సూటిగా చెప్పాలంటే మనిషి బుర్రలో పురుగులా తిరుగుతూ, ఇటు మానసికంగా హింసిస్తూ, మనల్ని మనం శారీరకంగా హింసించుకునేలా చేస్తాయి.

 5 Ways To Cope Up From Break Up-TeluguStop.com

ఇలాంటి కోణంలో వచ్చిన అర్జున్ రెడ్డి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణం, అలాంటి జీవితాలు ఎన్నో నిజ జీవితంలోనూ ఉండటం.అమ్మాయిలు, అబ్బాయలు తేడా లేకుండా ఆ బాధకి, ఆ నొప్పికి కనెక్ట్ అవడం.

కాని లవ్ లో ఫెయిల్ అయితే, లైఫ్ లో ఫెయిల్ అవ్వాలని కాదు కదా.బ్రేక్ అప్ నుంచి కోప్ అప్ కష్టమైన విషయమే కాని, జీవితం ముందుకి సాగాలంటే తప్పదు.ఒకవేళ మీరు ఆ వ్యక్తిని ఖచ్చితంగా మరచిపోవాలనే ఫిక్స్ అయితే, వారి ప్రవర్తన మిమ్మల్ని ఏడిపించి ఉంటే, మీరు వారి ద్వేషాని కన్నా ఎత్తులో నిలవాలంటే, ఈ టిప్స్ పాటించండి.

* మొదట ఆమె/అతడు మీకు ఇచ్చిన జ్ఞాపకాలు తుడిచివేయాలి.

ఫోటోలు డిలీట్ చేయాలి, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టిన కబుర్లు, అన్ని డిలీట్ చేయాలి.అవి అలానే ఉంటే మాటిమాటికి వాటినే చూస్తూ బాధపడాల్సి ఉంటుంది.

అందుకే అవి కంటికి కనిపించకుండా డిలీట్ చేయడం ఉత్తమం.

* నెగెటివ్ పాయింట్స్ ని మీ మెదడులో హైలెట్ చేసుకోండి‌.

మీ బ్రేకప్ కి కారణం ఏంటో, అందులో అతడు/ఆమె చేసిన తప్పులేంటో, వాటి వలన మీరు ఎలా బాధపడ్డారో తెచ్చుకోండి.ఆమెని/అతడిని మర్చిపోవడానికి సరైన కారణాలపై బాగా స్ట్రెస్ చేయండి.

* సక్సెస్ కన్నా పెద్ద రివేంజ్ లేదు అని అంటారు‌‌.కాబట్టి బ్రేకప్ తరువాత బలహీనంగా మారితే, అది మీ ఎక్స్ కి ఇంకా హాయినే ఇస్తుంది.

మీ సక్సెస్ మాట్లాడాలి.ఆమె/అతడు కంటికి కనిపించేలా, చెప్పాలంటే చెంప ఛెళ్ళుమనిపించేలా మీ సక్సెస్ ఉండాలి‌.“తననా నేను జీవితంలో వదిలేసుకుంది” అని వారు అనుకునేలా చేస్తే మీ పగ అనుకున్నది సాధించినట్టే‌.

* పనికి వ్యసనపడండి.

పనికి మాత్రమే లొంగండి.ఖాలిగా ఉంటేనే మద్యానికి, డ్రగ్స్ కి అలవాటు పడేది‌.

కాబట్టి రోజంతా పనిలో మునిగితేలేలా చూసుకోండి‌.అప్పుడే ట్రాక్ తప్పకుండా ఉంటారు.

* ఒంటరిగా అస్సలు ఉండొద్దు.ఒంటిరిగా ఉంటేనే డిస్టర్బ్ అయ్యేది‌.

స్నేహితులతోనే సమయాన్ని గడపండి‌.పాత స్నేహితులని మళ్ళీ కలిస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి.

మనకోసం ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అని అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube